Telugu Poem No Religion Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem No Religion

Rating: 5.0

గుళ్ళు
మసీదులు
చర్చీలు
తిరుగుతున్నావు
నువ్వు తెలుసుకుంటున్నదేందోగాని
అక్కడ మాత్రమే దేవుడున్నాడనే అబద్దాన్ని
గట్టిగా చెప్తున్నావు

నా మతమేపవిత్రమని
నా మత గ్రంథమే పవిత్రమని
నా మత భక్తులే పవిత్రులని
నా అభిమతమే నిజమనే విషవాయువుతో
స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నావు

మట్టి మీదేనిలబడగలవని
కడుపు నింపేది మట్టి మాత్రమేనని
ఉపిరి ఉన్నంత వరకు ఊడిగం చేసేది మట్టేనని
ఉపిరి వదిలినా దేహం మీద మట్టే సంతకం చేస్తుందని
మరిచిపోతుంటావు

దేశమంటే మట్టి కాదు మనుషులే, కాదన్నదెవరు! ?
మనుషులు
మతాన్ని కప్పుకొని తిరుగుతున్నందుకేబాధ
దేశం దేవాలయమని
రాజ్యాంగం పవిత్ర గ్రంథమని
అనుకోవడం పెద్ద కష్టమేమి కాదు, మనసున్నందుకు

పారువెల్ల
14-04-2019

Sunday, August 11, 2019
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success