1
హాయ్ అంటావు
ఓయ్ అంటావు
నీ పలుకులే నీకు తిరిగిస్తే
కొండా కోనలు మాట్లాడాయనుకుంటావు
2
ఒక్కొక్కసారి
నేను అచ్చం నీలాగే ఉండటాన్ని
నిన్ను నువ్వే జీర్ణం చేసుకోలేనంత అసహ్యంగా ఉంటుంది నీకు
3
హరివిల్లులో
నీకు నచ్చని రంగేదో తుడపాలనుకుంటావు
నచ్చిన రంగేదో అద్దాలనుకుంటావు
కనిపించినంత సేపు కళ్ళల్లో దాచుకోవాలన్న ధ్యాసే లేదు నీకు
రంగులు మాయమయ్యాక ఒంటరిగా మిగిలిపోతావు
పారువెల్ల
24-12-2016
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem