*APPLE*
_The sorrow of Kashmiri_
ఇటు
నా ఊసు మరిసినోడు
నా బతుకు పట్టనోడు
నా ఉనికి గిట్టనోడు
చావడానికేనేను పుట్టాననీ
ప్రతి రోజు నన్ను నిదుర లేపే కల!
అటు
అప్పుడప్పుడూఒకడు కెలుకుతుంటాడు
మార్పుకు సిద్ధం కమ్మని చెప్పి
పోరుకు బలిచేస్తుంటాడు.
కడుపు నిండానాలుగు ముద్దలు లేని
కంటి నిండా తీయటి కునుకే లేని, నాకు
ఉన్న కొద్దివెలుతురులో
చీకట్లను పారబోసి నన్ను నిలబెడతానంటాడు
ఇంకో వైపు
నూర్గురికి తోడుండి
ఆ నూర్గురినీ చంపించిన
పిట్ట కథల మేధావి శవమింకా మూల్గుతూనే వుంది
రాలిపోతున్న నాకు
రెక్కలనిస్తానని పొగబెడుతున్నది
ఈ మట్టికే తోడబుట్టినోన్ని
సరిహద్దుల గోడ కట్టుకున్న దేశాలకు, గోడుపట్టనోన్ని! !
ప్రతీ దిక్కూ
పరువు కోసంపోరాడుతున్నది!
నన్ను దిక్కులేని వాన్ని చేస్తున్నది.
తీయని పండైఒక కథగా మిగిలిపోకుండా
అప్పడప్పుడూ నీనోట్లో కరిగిపోవాలనే ఉంటుంది నాకు.
*పారువెల్ల*
22-02-2019
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem