Telugu Poem అల్విదా Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem అల్విదా

అల్విదా

సగం సిగిరెట్టులోనో 
సంగం టీ కప్పులోనో 
మందుకు అంచు మంచింగులోనో 
ఆత్మల్ని విడిచి కలిసుంటాయి దేహాలు

నిలుచుంటే భారం 
కూసుంటే దూరం 
మనల్ని మోస్తున్నది 
ఆధారమే కానట్టి సన్నని దారం

తలలోని నాలుక దాచేదొకటి 
నోట్లోని నాలిక విప్పేది ఇంకొకటి
నిజాలు  నీకెందుకు 
అబద్దం నాకెందుకు

కొన్ని సిగిరెట్లు 
కొన్ని పెగ్గులు 
పగలని కప్పులు 
ఇంకొన్ని మిగిలే వున్నందుకు  షుక్రియా


పారువెల్ల
13-01-2013

Sunday, January 21, 2018
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success