ఇంద్రధనుస్సు
వేసిన ఒక్కొక్క అడుగే
ఒక్కో రంగయ్యింది
పూసిన పున్నమికేమో
వెన్నెల తోడయ్యింది
అంతా
ఏ ముడి వరమో
ఏ మాటల బలమో
ఏ బొమ్మా వినలేదు
నీకన్నా మిన్నగా
ఏ బొమ్మా కనలేదు
నీకన్నా చల్లగా
నీ అడుగులు వెంటే రాకుంటే
కాలం కలిసి నడిచేనా
నీవే రెప్పగ తోడే లేకుంటే
రంగుల కల కలిసేనా
ఓ మెట్టు ఎక్కినపుడు
ఒలికిపోకుండా
ఇంకో మెట్టు జారినపుడు
బెణికిపోకుండా
చెలీ.....
నీ చల్లని చూపుల్లో
ఈ దీపం పదిలమే
తోవ తప్పిన అడుగుల మళ్లించి
తప్పులన్నీ మన్నించి
సఖీ! తల్లివెట్లా అయినావో! !
పారువెల్ల
16-12-16
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
అందమైన వర్షం విల్లు రియాలిటీ మనస్సుకి ఆకర్షిస్తుంది. ప్రతిదీ ఇక్కడ ఒక ముడి మరియు బహుమతి. జీవితం యొక్క ప్రతి దశ ప్రకృతి అందం సంబంధం ఉంది. అడుగుల పాయింట్ లేదు అద్భుతమైన ఉంది. ఈ చాలా అద్భుతమైన పద్యం...10 Andamaina varṣaṁ villu riyāliṭī manas'suki ākarṣistundi. Pratidī ikkaḍa oka muḍi mariyu bahumati. Jīvitaṁ yokka prati daśa prakr̥ti andaṁ sambandhaṁ undi. Aḍugula pāyiṇṭ lēdu adbhutamaina undi. Ī cālā adbhutamaina padyaṁ...10 Beautiful rain bow attracts mind with reality. Everything a knot and gift here. Each step of life is associated with beauty of nature. Missing the point of feet is amazing. This is a very wonderful poem...10