ఇక సెలవంటూ...
జీవాన్ని జనానికిచ్చి
నిర్జీవంగా కదిలి వెళ్ళిపోయావు
కన్నీళ్లతో తడిసిపోతుంటే
కడలి తీరంలో ఒదిగిపోయావు
ఎన్ని గుండెలు ఏడ్చినా
ఎన్ని గొంతులు పిలిచినా
ఈ రోజెందుకో దయలేని తల్లివైనావు
తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు
పారువెల్ల
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem