*ఇంకా వుంది*
1
ఎన్ని దేహాలు
విడిచి వచ్చిందో
ఎన్ని దారులు
తిరిగి వచ్చిందో
ఇప్పుడు నేను మోస్తున్న ఆత్మ
2
వాలిపోతున్న పొద్దు
రేపు మళ్ళీ పూస్తానన్నది
పగలంతా కళ్ళల్లో విత్తనాలు చల్లి
ఈ రాతిరి మళ్ళీ కలలు కనమన్నది
3
సముద్రం ఇప్పుడే ఇంకిపోదు
నువ్వూ
నేనూ
ఇంకా బతికే వున్నాం
దుఃఖం ఇంకా మిగిలే వుంది
*పారువెల్ల*
25-11-2016
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem