అద్దం
అబద్ధం అద్దానికీ అలవాటే
లెక్కించ గలిగే అస్థికలు
తూకానికి తూగని చితాభస్మం నేనని
ఒక్కసారైనా చెప్పలేదు
బ్రతికే బ్రతుకెంత గ్లామరైనా
ఏ బ్రతుక్కైనా గ్రామరొక్క టేనని
ఆరడుగుల్లో ఒదిగి పోవడమో
అగ్గిలో కరిగి పోవడమో నిజమని
~పారువెల్ల ~
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem