Telugu Poem కరిగి పోతావా కల ఉదయాన్ని పిలిచి Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem కరిగి పోతావా కల ఉదయాన్ని పిలిచి

* కరిగి పోతావా కల ఉదయాన్ని పిలిచి *

ఓ చిరు దీపం
కారు చీకట్లను తరిమేస్తుంటే

ఓ కలం
నవ వసంతాన్ని పలికిస్తుంటే

ఓ గళం
శిలాతి శిలలను కరిగిస్తుంటే

ఓ హృదయం
అమృత వర్షం కురిపిస్తుంటే

ఓ నేత్రం
సుచిత్ర భవితవ్యం చూపిస్తుంటే

ఓ మంత్రం
నలు దిక్కుల పాపాలను కడిగేస్తుంటే
కరిగి పోతావా కల ఉదయాన్ని పిలిచి

~పారువెల్ల ~

Saturday, November 12, 2016
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success