* ఇద్దరం *
ఒకప్పుడు ఒక్కటిగా
నిన్ను ప్రేమించినందుకో
దుఃఖాన్ని నిందించినందుకో
గీటు రాయి మీద నిన్ను నన్ను
గీసి చూసుకున్నందుకో
మనమిప్పుడు ఇద్దరం
మోహాన్ని దాహాన్ని
గుట్టుగా దాచుకున్నందుకో
గుడ్డి దీపం ఎత్తుకొని
దారిని దూరాన్ని తిట్టుకున్నందుకో
మనమిప్పుడు ఇద్దరం
~ పారువెల్ల ~
27-02-2015
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem