Telugu Poem తడి లేని ప్రవాహం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem తడి లేని ప్రవాహం

Rating: 5.0

* తడి లేని ప్రవాహం *

ఒక్కొక్కసారి...
దేహం లోతుల్లోకి మనసు ప్రవహించదు

తడిని గుండెలో దాచుకున్న మట్టి
చెట్టులా నవ్వడమూ కనిపించదు

తీరంలో ఇసుక మీద రాసిన రాతలు
ఏ సంగతి చెప్పకుండానే చెరిగిపోతాయి
అయినా ఏమీ అనిపించదు

మామిడి కొమ్మల చిగురుటాకులు
మసక మబ్బుల్ని చూసి దిగులుపడినా
పూత పూసిన పువ్వంతా రాలిపడినా
ఏ దృశ్యమూ కనిపించదు
ఏ శబ్దమూ వినిపించదు

లోపలినుండి వెలుపలికి
పచ్చదనాన్ని పదే పదే తరుముతున్నట్లూ తెలియదు
అలసి పడుకున్నాక బీడుపడ్డ మైదానంలా మేల్కోవడం
అనుకోకుండానే జరిగిపోతుంది.
ఇక
లోపలినుండి వెలుపలికి
వెలుపలినుండి లోపలికి
ప్రవహించేందుకు తడి మిగలకపోవచ్చు

~ పారువెల్ల ~
19-01-2014

Saturday, November 12, 2016
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success