Telugu Poem వెంటాడుతున్న గాయం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem వెంటాడుతున్న గాయం

Rating: 5.0

* వెంటాడుతున్న గాయం *

అవును
అది అడివే

మహానగరంలో నువ్వు చూసిన
ఏ మ్రుగమూ లేదక్కడ

నువ్వెప్పుడూ చూడని
ఓ నెత్తుటి మరక
నువ్వు విత్తని ఓ కత్తుల మొలక
మట్టిసాక్షిగా అక్కడే

ఆత్మను దాచుకొని
విరిగిన దేహంతో
ఒక ఒంటరి గుడిసె

ఇంకా వినిపించే...
ఆరిపోయిన దీపాన్ని
ఊరేగిస్తూ పాడిన పాట
ఇప్పటికీ కాలుతున్న
ఓ గంధపు కట్టె

చూడాలనుకుంటే
ప్రవేశం నిషిద్ధం
అడవికెవరో కంచె వేశారు
నగరంలోకి వస్తుందని

~ పారువెల్ల ~

Saturday, November 12, 2016
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success