ఎప్పటికీ
నాలుగు భుజాలతో దోస్తీ
రాసేవుంచుతుంది కాలం
ముందెవరో
వెనకెవరో
గుండెను తడుపుకోవడానికి
ఎప్పుడూ మిగిలేవుంటది దుఃఖం
ఎవరున్నా
లేకున్నా
ఓ తోడు
నీడలాగే వెంట నడుస్తది
~ పారువెల్ల ~
16-03-2015
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem