* మిగిలేదొక్కటే *
పూయగానే పూలరెక్కలు విడిపోవడం
పుట్టగానే లేత చిగురు వెక్కిరించడం
కురవకుండానే మబ్బులు ఆవిరవడం
చేరువైనవన్నీ చెప్పకుండానే వెళ్ళిపోవడం
ఒక్కొక్కటి దూరమవడం
ఏ వొక్కటీ మిగలక పోవడం
అన్నీ అనుకోకుండానే
అంతా అనుకోకుండానే
ఏదీ అర్థంకాక మునుపే
అంతా జరిగిపోతుంటది.
నిన్నామొన్నా మాట్లాడినగాలి
పరిచయమే లేనట్టుంటది.
తెగిపడ్డ తలపులన్నీ ఆత్మను తిట్టిపోస్తవి
కలలన్నీ
తీరంలో ఒంటరిగా దిక్కులేని రాతలవుతవి
అలలని ఆపే చేతులు కావాలని
ఏ రాయినీ కోరని హృదయం
ఇప్పుడు రాయిలా మారిపోతది.
దూరతీరాల దుఃఖం దగ్గరవుతది
కారే కన్నీటిచుక్క విశ్వాసంగా తోడుంటది
~ పారువెల్ల ~
30-05-2015
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem