ఇంకెంత దూరం అనుకున్నప్పుడల్లా ఇంకొంతేనని
ఇంకెంత కాలం అనుకున్నప్పుడల్లా మరో నిమిషమేనని
మభ్య పెడుతూ మన మధ్యే తిరిగిన గాలి
ముఖం చాటేసి ఎందుకు తిరిగిందో..!
పూల రెక్కలు రాలి పడ్డాయెందుకో
నవ్వుతూ నవ్విస్తూ నవ్విన పువ్వు
నలిగిపోయిందెందుకో...! !
నా మీద నాకు జాలి తప్ప
నేను దాచుకున్న గులక రాళ్ళ గుండెచప్పుడు
నీ దాకా చేరనందుకు బాధ లేదు...! ! !
చెప్పేటప్పుడు నా నాలుక
వినేటప్పుడు నీ చెవులు
మోయలేని ఒక బరువైన మాట
'ఇక శెలవని' నీకెలా చెప్పాలో అర్థం కాదు..! ! ! !
పారువెల్ల
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem