నీ ప్రేమానుగ్రహం లేని
విశ్వమే ఒక శూన్యప్రదేశం
నీ సౌకుమార్యపు సాగరం లేక
ఈ ప్రపంచమే సార రహితం
రసహీనం, ప్రేమ హీనమైన
సంసారం అర్థరహితం!
కళ, కవనాలు లేని
కాశ్యపి కాదా ఒక సహారా ఎడారి?
కృతజ్ఞతా కరుణలు
స్వర్గానికి రాజమార్గాలైతే
హత్యలు, బాంబులూ
నరకానికి మెట్ల మార్గాలు!
నా ప్రపంచంలో నువ్వూ నేను
నీ హృదయపార్శ్వాన నా జీవనం!
నీ ఉరఃపంజరం నుండీ
వేరు చేయబడ్డ ఆస్తికను నేను!
I scarcely read Telugu. But I managed to read the caption. "Nivvu Leni Nenu" meaning "my existence in your absence" captures the theme of the poem quite well. Thank you.
Thank you so much. 🙏🙏🌹